ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ కల్యాణ్ బెనిఫిట్ షో, పాల వ్యాపారం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని డిప్యూటీ స్పీకర్ రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు తిరుపతిలో విమర్శించారు. ఏపీలోకి అమూల్ ప్రాజెక్టును తీసుకురావడం.. చంద్రబాబు కక్షసాధింపు చర్యగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. చిత్తూరు పాల డెయిరీ, సహకార సంఘాలు మూసివేసినప్పుడు కక్ష సాధింపు చర్య గుర్తుకు రాలేదా అని వారు ప్రశ్నించారు.
'వాటిపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు' - Malladi Vishnu latest news
తెదేపా అధినేత చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమూల్ ప్రాజెక్టు రావడాన్ని చంద్రబాబు కక్షసాధింపు చర్యగా మాట్లాడడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
మల్లాది విష్ణు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన విధంగా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: