దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ భారీగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ చాలా మంది ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదన్నది వాస్తవం. దీనికి నిర్లక్ష్యం ఓ కారణమైతే.. ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలు, అమలు చేస్తున్న నిబంధనలు తమ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న భావన మరొక కారణమని చెబుతున్నారు వైద్యరంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే కరోనాను ఆపడం కష్టసాధ్యమని చెబుతున్నారు. పౌర స్పృహతోనే వైరస్ ఉద్ధృతి తగ్గుతుందని అంటున్నారు.
అయితే కేవలం మూడు సూత్రాలు పాటిస్తే కరోనా మన దరిచేరదని చెబుతున్నారు వైద్యరంగ నిపుణులు. అవి
1. మాస్కు ధరించడం
ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టినప్పటి నుంచి మరలా తిరిగి ఇంటికి చేరే వరకు మాస్కు విధిగా ధరించాలి. మధ్యమధ్యలో దానికి తాకడం కానీ, తీయడం కానీ చేయొద్దు.
2. సామాజిక దూరం