ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో నిరసన - protest at Tirumala news

తిరుమల నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించటం వివాదాస్పదంగా మారింది. యాజమాన్య వైఖరి నశించాలి.. డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తూ బస్ డిపోలకు వెళ్లడం కలకలం రేపింది.

protest at Tirumala
protest at Tirumala

By

Published : Dec 14, 2020, 8:25 PM IST

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపోలో ఆర్టీసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పుణ్య క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా, భక్తులకు అసౌకర్యం కలిగేలా ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా తిరుమలలో నిబంధనలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా... ఈ ఉద్యోగ సంఘం వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది.

ఒక్క లీటర్ డీజిల్​కు నిర్ణీత కిలోమీటర్లు (కె.ఎమ్.పి.ఎల్) బస్సు నడవాలన్న నిబంధన పేరుతో వేధించవద్దని, చలి తట్టుకునేందుకు స్వెట్టర్లు అందజేయడం వంటి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ప్రదర్శిస్తూ ఉద్యోగులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details