ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి కోసం.. పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ..! - మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోోవాలని జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన

ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

protest-under-the-auspices-of-the-jac-held-in-tirupati-against-the-government-decision
అమరావతి పై జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా

By

Published : Jan 22, 2020, 3:27 PM IST

అమరావతి పై జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా.. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగర పాలక సంస్థ వద్ద నల్ల జెండాలతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు...తెదేపా కార్యకర్తలు బైఠాయించారు. అమరావతే ముద్దు....మూడు రాజధానులు వద్దంటూ... ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అమరావతి పరిరక్షణ పోరాటానికి సహకరించాలని....పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.

అనంతరం కొందరు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో....అమరావతి పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. శాసనమండలి సమావేశాల ప్రత్యక్షప్రసారాలను....ఎందుకు నిలిపివేశారో ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ కోసం... పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.

ABOUT THE AUTHOR

...view details