ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 5:59 AM IST

ETV Bharat / city

రేపే.. తిరుమలకు రాష్ట్రపతి రామ్​నాథ్

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 12.50 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని మహాద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేయనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా మంగళవారం శ్రీవారి దర్శనాన్ని దాదాపు 2 గంటలకుపైగా నిలిపివేయనున్నారు.

president ramnath kovind is going to visit tirumala lord balaji temple
మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమల రానున్నారు. చెన్నై నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలికి పర్యటనలో పాల్గొననున్నారు.

అక్కడి నుంచి తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమలలోని విశ్రాంతి గృహానికి చేరుకుంటారు. 12.50 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని మహాద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేయనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 3 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 3.50 గంటలకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు.

రాష్ట్రపతి రాక సందర్భంగా మంగళవారం తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి దర్శనాన్ని కూడా దాదాపు 2 గంటలకుపైగా నిలిపివేయనున్నారు.

ఇదీ చదవండి:

నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details