రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వేద సత్కారం అందుకున్నారు.
రాష్ట్రపతి వెంట గవర్నర్ బిశ్వభూషణ్ ఉన్నారు. మధ్యాహ్నం 1.05 గం.కు వరాహస్వామిని దర్శించుకుని.. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి చెన్నై తిరిగి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.