తిరుమల శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో తితిదే పటిష్ట చర్యలు చేపట్టింది. అలిపిరి టోల్గేట్ సమీపంలో థర్మో స్కానర్లు ఏర్పాటు చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య పరిస్ధితులను సమీక్షించడానికి తగిన చర్యలు చేపడుతోంది. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. భక్తులను పరీక్షించడానికి అనుసరిస్తున్న విధానాలపై తితిదే ముఖ్య భద్రతా నిఘా విభాగ అధికారి గోపీనాథ్ జెట్టితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
తిరుమలలో అడుగడుగునా తనిఖీలు - tirumala latest news
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను ఈ నెల 8 నుంచి అనుమతించనున్న నేపథ్యంలో తితిదే సన్నాహాలు ముమ్మరం చేసింది. అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకు అడుగడుగునా తనిఖీలు నిర్వహించనుంది.
కరోనా నివారణకు తితిదేలో పటిష్ట చర్యలు