ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డాక్టర్ కిరిటీ, డాక్టర్ శశి కుమార్​ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల డాక్టర్ శిల్పా ఆత్మహత్య వార్తలు

తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్​గా డాక్టర్ కిరీటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్​గా డాక్టర్ శశి కుమార్ ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ శిల్పా ఆత్మహత్య కేసులో వీరిరువురూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

డాక్టర్ కిరిటీ, డాక్టర్ శశి కుమార్​ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
డాక్టర్ కిరిటీ, డాక్టర్ శశి కుమార్​ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Oct 8, 2020, 9:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన డాక్టర్ శిల్పా ఆత్మహత్య కేసులో నిందితులుగా డా.కిరిటీ, డా.శశికుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018 ఆగస్టులో డా.శిల్పా బలవన్మరణానికి పాల్పడగా..... వైద్య కళాశాల ప్రొఫెసర్ల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

దీంతో నాటి తెదేపా ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా...... దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో ఈ కేసుకు సంబంధించి ఎస్వీ వైద్యకళాశాలలో శాఖా పరమైన విచారణ జరిగింది. తాజాగా డా.కిరిటీ, డా.శశికుమార్ లకు పోస్టింగ్ కల్పిస్తూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details