ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అది అగ్ని ప్రమాదం కాదు.. ఆత్మహత్యే.. తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్​.. - tirumala fire accident issue latest news

తిరుమల అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధరించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్‌ పోసుకుని మల్లిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.

tirumala fire accident issue
తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్

By

Published : May 7, 2021, 2:03 PM IST

తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్

తిరుమలలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని పోలీసులు నిర్ధరించారు. మల్లిరెడ్డిది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్‌ పోసుకుని మల్లిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకోవడం వల్లే ఇతర దుకాణాలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ప్రమాదానికి కొంత సమయం ముందు తన ఫోన్‌ను మల్లిరెడ్డి స్నేహితునికి ఇచ్చాడు. మల్లిరెడ్డి ఫోన్‌లో సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. కుటుంబకలహాలు ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో ప్రస్తావించారు. క్యానులో పెట్రోలు పట్టుకున్న సీసీ కెమెరా దృశ్యాలు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

ఇదీ చదవండి: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి

ABOUT THE AUTHOR

...view details