పేకాట శిబిరంపై పోలీసుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి మృతి చెందిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతోంది. కొత్తవీధిలోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో...నగరపాలక సంస్థ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తి మృతిచెందారు. తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి జారిపడ్డారా? రెండో అంతస్తు నుంచి వేరే భవనాన్ని దాటే క్రమంలో పడిపోయారా అని నిర్ధరించవలసి ఉందని డీఎస్పీ బారిక నరసప్ప అన్నారు. కృష్ణయ్య మృతిపై బంధువులు, కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుయా ఆసుపత్రి మార్చురీ ఎదుట నిరసన చేశారు. భవనంపై నుంచి దూకి మృతిచెందిన వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.41,500 నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.