ఈనెల 21 నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తెదేపా నిర్వహించనున్న ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం అలిపిరిలోని గరుడ కూడలిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 10 రోజులపాటు 700 గ్రామాల్లో జరిగే యాత్రలో వైకాపా దుర్మార్గాల్ని నిలదీయాలని, ప్రజల్ని చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు.
తెదేపా ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి - తిరుపతి తాజా వార్తలు
తెదేపా తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు మార్గం సుగుమమైంది. యాత్ర నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిని తిరుపతి నుంచి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారు.

TDP YATRA