తిరుపతి(Tirupati) నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గంజాయి(students selling cannabis)ని విక్రయిస్తున్నారన్న రహస్య సమాచారంతో పోలీసులు సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిని చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు.
Tirupati: తిరుపతిలో గంజాయి ముఠాపై ఆరా.. పోలీసులు అదుపులో విద్యార్థులు - తిరుపతి తాజా సమాచారం
తిరుపతి(Tirupati)లో విద్యార్థులు గంజాయి(students selling cannabis) విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి సరఫరా చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాల మేరకు తిరుపతి క్రైం, వెస్ట్ పోలీసుస్టేషన్, చంద్రగిరి పోలీసులు ఆయా విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి వారికి గంజాయి చేరిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలుస్తోంది. వారికి గంజాయి సరఫరా చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. భీమవరం ముఠాతో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి? ఎంతకాలం నుంచి ఇక్కడకు గంజాయి చేరుతోంది? ఇప్పటివరకు ఎంతమందికి విక్రయించారు? వంటి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు తిరుపతికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి