తిరుమలలో చిన్నపిల్లల వద్ద బంగారాన్ని దొంగలిస్తున్న ఓ వ్యక్తిని పొలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన అనంతరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్నదానం పరిసర ప్రాంతాల్లో ఏడుగురి పిల్లల దగ్గర బంగారు గాజులను దొంగలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలలో పిల్లల వద్ద బంగారం చోరీ.. ఓ వ్యక్తి అరెస్ట్ - latest news in chittor district
తిరుమలలో చిన్నపిల్లల వద్ద బంగారు నగలు దోచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అన్నదాన భవన వద్ద ఏడుగురు పిల్లల గాజులు దొంగిలించినట్లు వెల్లడించారు.
చిన్న పిల్లలతో వచ్చే తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని కొరిన పోలీసులు... తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టిక్కెట్లు పొందాలని కోరారు. వీఐపీ బ్రేక్ దర్శనంకోసం నఖిలీ సిఫార్సు లేఖల పట్ల భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఇటీవల నఖిలీ టిక్కెట్లతో, సిఫార్సు లేఖలతో యాత్రికులను మోసగిస్తున్నవారిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండీ..krishna water disputes : కృష్ణా జలాల వివాదం.. ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ