తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఆస్పత్రిలోని మెడిసిన్ గోడౌన్ వెనుక భాగంలో కాలిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి శరీర భాగాలను అక్కడి వారు గుర్తించి పోలీసులను సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అలిపిరి పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి..ఎముకలు మాత్రమే ఉండటంతో చనిపోయింది..స్త్రీ నా లేదా పురుషుడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో కాలిపోయిన సూట్ కేసు భాగాలు లభ్యం కావడంతో ఎవరైనా హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి శరీర భాగాలను కాల్చివేశారా...అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
UNKNOWN DEAD BODY: రుయా ఆస్పత్రి ఆవరణలో కాలిన మృతదేహం కలకలం - చిత్తూరు జిల్లా నేర వార్తలు
తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Rua Hospital
Last Updated : Jun 23, 2021, 9:03 PM IST