ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డాలర్​ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్​.. వ్యక్తిపై కేసు నమోదు - tweets on dollar seshadri news

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. తన ఆరోగ్యంపై బద్రి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ... తితిదే ఉన్నతాధికారులకు డాలర్‌ శేషాద్రి ఫిర్యాదు చేశారు. డాలర్‌ శేషాద్రి ఫిర్యాదును పరిశీలించిన తితిదే ఉన్నతాధికారులు.. విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు వివరించారు.

డాలర్​ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్​.. వ్యక్తిపై కేసు నమోదు
డాలర్​ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్​.. వ్యక్తిపై కేసు నమోదు

By

Published : Jul 20, 2020, 3:53 PM IST

తనకు కరోనా సోకిందంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్లపై తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్​ శేషాద్రి స్పందించారు. ఎస్వీ బద్రి అనే వ్యక్తి తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయటంతో పాటు శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఆయన.. తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తితిదే విజిలెన్స్​ వింగ్​ ఏవీఎస్​వో నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ కింద ఎస్వీ బద్రిపై కేసు నమోదు చేశారు.

కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో దర్శనాలను నిలిపివేసేందుకు వెనుకాడుతున్నారంటూ ఎస్వీ బద్రి ట్వీట్ చేశారు. డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ వచ్చినా... అర్చకులకు మహమ్మారి సోకుతున్నా పట్టించుకోని తితిదే అధికారులు ఖర్మఫలం అనుభవించక తప్పదంటూ ఎస్వీ బద్రి ట్వీట్ చేయటం తిరుమలలో కలకలం సృష్టించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details