Minister Roja Phone Missing: తిరుపతి ఎస్వీయూలో సమీక్ష నిర్వహించడానికి తొలిసారి వెళ్లిన మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. యూనివర్సిటీ ఆవరణలో మంత్రి ఫోన్ మాయమైంది. రాష్ట్ర స్థాయి శాప్ అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు మంత్రి రోజా తిరుపతి చేరుకున్నారు. ఎస్వీయూలోని సెనెట్ హాలులో రోజా సమీక్షిస్తున్న క్రమంలో తన ఫోన్ కోసం చూసుకున్నారు. కానీ.. ఫోన్ కనిపించలేదు. విషయం తెలుసుకున్న సిబ్బంది.. అన్నిచోట్లా వెతికారు. కానీ.. ఫోన్ మాత్రం కనిపించలేదు.
మంత్రి రోజా ఫోన్ కొట్టేశాడు.. పోలీసులు అలా పట్టేశారు..! - తిరుపతి ఎస్వీయూలో మంత్రి రోజా సమీక్ష
12:57 April 21
తిరుపతిలో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి ఫోన్!
Minister Roja Phone Missing: చివరకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మంత్రి రోజా సంచరించిన ప్రాంతాలు, పరిసరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సమీక్షకు ముందు ఎస్వీయూ ఆవరణలో ఉన్న ఆలయానికి రోజా వెళ్లారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే సమయంలోనే ఆమె ఫోన్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ చరవాణి జాడ కనిపించలేదు. దీంతో ట్రాకింగ్ ను ఆశ్రయించారు.
Minister Roja Phone Missing: ట్రాకింగ్ ద్వారా చేసిన ప్రయత్నం ఫలించింది. మంత్రి ఫోన్ చోరీకి గురైందని తెలుసుకున్న పోలీసులు.. అది ఎక్కడ ఉందనేది కూడా కనిపెట్టారు. ఎస్వీయూలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని.. మంత్రికి అప్పగించారు. అనంతరం మంత్రి ఫోన్ చోరీ చేసిన ఒప్పంద ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా.. తెదేపాకు అండగా నిలవాలి: చంద్రబాబు