తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళంగా అందాయి. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము వీటిని.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
విరాళంగా ఇచ్చినవాటిలో... 7 రకాల.. 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నట్లు తెలిపారు. తితిదే అన్నప్రసాదం భవనంలో భక్తులకు వీటిని వడ్డించనున్నారు.