కృషి, పట్టుదలతోనే విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోగలరని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో ఒకసారి ఓడిపోతే జీవితమంతా ఓడినట్టు కాదని గుర్తు చేశారు.
రోజూ గంటపాటు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే విజయం వరిస్తుందని చెప్పారు. విద్యార్థులు సోషల్ మీడియాలోని అవాస్తవ విషయాల జోలికి వెళ్లవద్దని సూచించారు. స్విమ్స్ సంచాలకులు డాక్టర్ భూమా వెంగమ్మ మాట్లాడుతూ.. జీవితంలో కష్టపడే వారే స్థిరపడతారని చెప్పారు. డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.