పేరూరు చెరువు.. పరిసర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువుకు గండి కొడితే పాతకాల్వతోపాటు దిగువన ఉన్న గ్రామాలు నీట మునుగుతాయి. గండి కొట్టకపోతే తిరుపతి వైపు వరద మళ్లుతుంది. ఈ పరిస్థితుల నడుమ అధికారులు అనివార్యంగా పేరూరు చెరువు(peruru lake in Tirupati)కు గండి కొట్టి నీటిని పాతకాల్వ వైపు మళ్లించారు.
Problems of peruru lake at Tirupati : పేరూరు చెరువుకు గండి.. పునరావాస కేంద్రాలకు బాధితులు - tirupathi weather news
తిరుపతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు(Heavy rains in Tirupati) నగరవాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు చెరువు వరద నీటితో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు చెరువుకు గండి కొట్టి నీటిని విడుదల చేశారు. ఫలితంగా.. చెరువు కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
పేరూరు చెరువుకు గండి
దీంతో.. గొల్లపల్లి, రామానుజపల్లి, చిగురువాడ వైఎస్ఆర్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పేరూరు చెరువు గండిని మూసేయాలంటూ పాతకాల్వ గ్రామస్థులు ఆందోళన చేశారు. 4 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీచదవండి.
Last Updated : Nov 26, 2021, 7:11 PM IST