ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అభ్యర్థులు వేరైనా... భాజపా, వైకాపా రెండూ ఒకటే: శైలజానాథ్ - భాజపా మరియు వైకాపాపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

అభ్యర్థులు వేరైనా.. భాజపా, వైకాపా రెండూ ఒకటేనని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోలేని ఆ పార్టీలు.. ఏ మోహం పెట్టుకొని తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం చేస్తాయని ప్రశ్నించారు.

pcc sailajanath on tirupati by election
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

By

Published : Mar 30, 2021, 3:25 PM IST

వైకాపా, తెదేపా, భాజపా, జనసేన.. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌... ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.

అభ్యర్థులు వేరైనా....భాజపా, వైకాపా రెండు ఒకటేనని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు సాధించడం సంగతి ఎలా ఉన్నా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకొంటే చాలని హితవు పలికారు. తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థి గెలుపొందితే భాజపాకు సాయపడటం తప్ప మరేమీ చేయలేరన్నారు.

ABOUT THE AUTHOR

...view details