పవన్ కల్యాణ్ సినిమాలకు కాల్షీట్స్ లేకపోతేనే ప్రజల్లోకి వస్తారని మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తూ ఏ రాజకీయ పార్టీల వైపు చూడడం లేదన్నారు. రహదారులపై ఏదో చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే నీచపు ఆలోచనతో జనసేన ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణ సరిగా లేదన్న మంత్రి... వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.
రాజధానిలో అమరావతి రైతులు బూటకపు ఉద్యమాలు చేస్తున్నారని.. షెడ్లు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రజలు తెదేపాకు వ్యతిరేకంగా ఉన్నారనడానికి మంగళగిరి ఎన్నికలే నిదర్శనమన్నారు.