ప్రభుత్వం తెలుగు వైభవాన్ని విస్మరిస్తోందన్న జనసేనాని తమ బిడ్డలను ఏ భాషలో చదివించుకోవాలనేది తల్లిదండ్రుల హక్కని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగును చంపడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. జనసేన ఆధ్వర్యంలో... తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. భాషా పండితులు, అవధానులు, పురాణ పండితులు, విద్యావేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. మాతృభాష ప్రాధాన్యం, ఆంగ్ల భాష ప్రభావంపై చర్చించారు. మాతృభాష పరిరక్షణకు అవలంబించాల్సిన విధానాలపై సమాలోచనలు చేశారు. ప్రాథమిక దశలో విద్యార్థులకు మాతృభాషలో బోధన ప్రాముఖ్యతను వివరించారు.
సిగ్గు పడుతున్నా..!
తాను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నానని జనసేనాని పవన్ అన్నారు. ఇంగ్లిషు చదువే గొప్పదైతే జైలు కెందుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. తెలుగు భాష వైభవాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్న ఆయన.. ఉర్దూ, ఒడియా, తమిళం, బెంగాలీ మాధ్యమ పాఠశాలలు ఉండగా తెలుగు భాషపైనే ఎందుకు పడ్డారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాష జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆడపిల్లల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చూడండి:
సచివాలయ ఉద్యోగులకు నైట్షిప్టులు.. రానందుకు మెమోలు..!