ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి: పవన్ - తితిదే వివాదంపై పవన్ కల్యాణ్ స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా కారణంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో వారి పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించటం సహేతుకం కాదని అన్నారు.

pawan kalyan respond on ttd issue
pawan kalyan respond on ttd issue

By

Published : May 2, 2020, 8:49 PM IST

తితిదేలో పొరుగు సేవల ఉద్యోగులను తొలగించడంతీవ్రమైన అన్యాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 1400 మంది కార్మికుల పొట్ట కొట్టొద్దని తితిదేను కోరారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించొద్దని... వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని చెప్పిన మాటలను పవన్ గుర్తుచేశారు. ఒక్క కలం పోటుతో కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదని హితవు పలికారు. వారంతా గత 15 ఏళ్లుగా పనిచేస్తూ స్వల్ప జీతాలు తీసుకునే చిరు ఉద్యోగులని... తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం, తితిదేకు పవన్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details