తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు మరోలా ఉండేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలిపించిన రైతుల కోసం వైకాపా ఏం చేయలేకపోతే ఒక ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎస్సీలపై ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఓటమి ఎదురైనా నిలబడగలమని నిరూపిస్తున్నానన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరంజీవి రాజకీయాల్లో ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది: పవన్
తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు మరోలా ఉండేవని అన్నారు.
చిరంజీవి రాజకీయాల్లో ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది: పవన్
Last Updated : Dec 4, 2020, 4:28 AM IST