అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన... రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు భరత్‌కు 30 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అలాగే పవన్ వ్యక్తిగత సిబ్బంది 11 వేల రూపాయలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును కూడా భరత్‌కు పవన్ అందించారు.
మరోవైపు అంతకు ముందు మీడియాతో మాట్లాడిన పవన్... ప్రభుత్వ ఉదాసీనతే ఆలయాల్లో దాడులకు కారణమని ఆరోపించారు. ఆలయాల మీద దాడులపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అన్నారు. వేరే మతాల ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే... ఇంతే నిర్లిప్తంగా ఉంటారా అని ప్రశ్నించారు. నిందితులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుందని పవన్ పేర్కొన్నారు.