ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏకాంతంగానే శ్రీవారి పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవారికి విజయదశమి పార్వేట ఉత్సవాన్ని తితిదే అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసునికి పంచాయుధాలు ధరింపజేసి...నమూనా అడవిలో వేట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగించారు.

తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం

By

Published : Oct 25, 2020, 9:49 PM IST

ఏకాంతంగానే శ్రీవారి పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. పార్వేటోత్సవంలో భాగంగా కల్యాణోత్స‌వ‌ మండపంలో మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని సన్నిధి నుంచి వేంచేపు చేశారు. అక్కడ పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రింపచేశారు. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని తితిదే అట‌వీ విభాగం ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా నమూనాను రూపొందించింది.

న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు.

ఇదీ చదవండి :ఘనంగా దుర్గమ్మకు తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details