ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2022, 5:21 PM IST

Updated : Jan 17, 2022, 9:36 AM IST

ETV Bharat / city

తిరుమలలో.. శ్రీవారి పార్వేట ఉత్సవం

కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమలలో పార్వేటు ఉత్సవంను తితిదే వైభవంగా నిర్వహించింది. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ కృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. అక్కడ ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం స్వామివారు వేటకు వెళ్లే సన్నివేశాలను నిర్వహించారు. అర్చకులు మూడు సార్లు స్వామి వారి తరపున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. తితిదే గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున పాపవినాశనం రహదారిలోని అటవీ ప్రాంతంలోని పార్వేట మండపం వద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

తిరుమలలో.. శ్రీవారి పార్వేట ఉత్సవం
parveta celebrations in tirumala

తిరుమలలో.. శ్రీవారి పార్వేట ఉత్సవం
Last Updated : Jan 17, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details