అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వైకాపాకు తిరుపతి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఓటర్లను కోరారు. సత్యవేడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆమె.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకుందని దుయ్యబట్టారు. వెంకన్న సాక్షిగా ఏపీకి హోదా ఇస్తామన్న భాజపా... తర్వాత కాలంలో హోదా ముగిసిన అధ్యాయమని ప్రకటించిందన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ప్రశ్నించారు.
ఉప ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలి: పనబాక లక్ష్మి - panabaka lakshmi
తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు బద్ధి చెప్పాలని తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. అధికార పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఉప ఎన్నికలో భాజపాకు పోటీ చేసే అర్హత లేదన్నారు.
తిరుపతి పు ఎన్నిక 2021