తితిదేలో మరో వివాదం చర్చనీయాంశమైంది. తితిదే కొత్తగా రూపొందించిన 2020 క్యాలెండర్ పీడీఎఫ్‌ను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సమయంలో అన్యమత నినాదం కనిపించడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల నుంచి విమర్శలు రావడం వల్ల అధికారులు శనివారం ఉదయం దీన్ని తొలగించారు. కొత్త క్యాలెండర్ ప్రతిని ఇంకా ఆన్లైన్లో తితిదే అందుబాటులోకి తీసుకురాలేదు. 2019 ఏప్రిల్ 6న అప్లోడ్ అయిన క్యాలెండర్ పీడీఎఫ్ లింక్ కింద ఈ అన్యమత నినాదం కనిపించింది. ఈడీపీ(ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్), టీసీఎస్ సంస్థలు తితిదే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై విచారిస్తున్నామని తితిదే అదనపు ముఖ్య విజిలెన్స్ అధికారి శివకుమార్‌రెడ్డి తెలిపారు.
తితిదేలో వివాదం.. వెబ్సైట్లో అన్యమత నినాదం - pagon religion contraversy in ttd website
తితిదే కొత్తగా రూపొందించిన 2020 క్యాలెండర్ పీడీఎఫ్‌ను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సమయంలో అన్యమత నినాదం కనిపించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారిస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.
తితిదేలో మరో వివాదం.. వెబ్సైట్లో అన్యమత నినాదం