తిరుమలలో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ నిర్వహణ కష్టమని తితిదే సిబ్బంది భావించారు. ఆగమ సలహా మండలి సూచన మేరకు తాత్కాలికంగా పరిణయోత్సవాలు వాయిదా వేశారు. మరో ముహూర్తాన పరిణయోత్సవాలను నిర్వహిస్తామని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మే 3 తర్వాత... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు శ్రీవారి దర్శనాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా - పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా
పద్మావతి పరిణయోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. భౌతిక దూరాన్ని పాటించటం కష్టమని ఉత్సవాలను వాయిదా వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
tirumala