ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో గదుల కేటాయింపునకు నూతన కేంద్రాలు ప్రారంభం - తితిదే తాజావార్తలు

తిరుమలలో గదులు కేటాయించేందుకు నూతన కేంద్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారికి గదుల వివరాలను ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా తెలియచేస్తారు.

new centers for allotment of rooms
గదులు కేటాయించేందుకు నూతన కేంద్రాలు

By

Published : Jun 12, 2021, 10:12 AM IST

తిరుమలలో గదులు కేటాయించే నూతన కేంద్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేయాలని ఐదు కొత్త కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారికి గదుల వివరాలను ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా తెలియచేస్తారు.

ఎలాంటి సిఫార్సులు లేకుండా, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యక్రమంలో రూమ్స్​ కేటాయించనున్నారు. ఎస్‌ఎమ్‌ఎస్‌లో వచ్చిన వివరాల ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో నగదు చెల్లించి, గదిని పొందేలా ఏర్పాట్లు చేశారు. అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం గదుల కేటాయింపు మొదలుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details