ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం - tiruchnauru latest news

కొవిడ్‌ నిబంధనల మేరకు జూన్ 8 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులను అనుమ‌తిస్తున్నా.. విరామ సమయ దర్శనాలను మాత్రం ఇప్పటి వరకు అమలు చేయలేదు. నేటి నుంచి బ్రేక్‌ దర్శనం పునఃప్రారంభిస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

on 6th January padmavati ammavari break darshanam
ఈ నెల 6 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం

By

Published : Jan 6, 2021, 6:59 AM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు తితిదే ప్రకటన చేసింది. క‌రోనా లాక్‌డౌన్​తో ఆల‌యంలో విరామ సమయ ద‌ర్శ‌నాన్ని కొన్నాళ్ల క్రితం తాత్కాలికంగా నిలిపివేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు జూన్ 8 నుంచి ఆల‌యంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులకు అనుమ‌తిచ్చినా.. విరామ దర్శనాలు అమలు చేయలేదు.

తిరిగి.. నేటి ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకు వీఐపీ విరామ సమయ దర్శనాలను అమలు చేయనున్నారు. ప్రోటోకాల్‌ వీఐపీలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తితిదే తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details