ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అధికారులు - ttd cvso gopinath jetti news

తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను తితిదే సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు కల్పించే సౌకర్యాలపై ఆరా తీశారు.

Rathsaptami arrangements
రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

By

Published : Feb 14, 2021, 5:58 PM IST

తిరుమలలో రథసప్తమి కోసం చేస్తున్న ఏర్పాట్లను తితిదే సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. రథసప్తమి రోజున ఏడు వాహన సేవలను నిర్వహిస్తారు. వాటిని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. వేలాది మంది భక్తులకు కల్పించే ఏర్పాట్లపై అధికారులు ఆరా తీశారు.

తిరుమాడవీధుల్లో ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను తనిఖీ చేశారు. యాత్రికులను అనుమతించి, బయటకు పంపే విధానాలను తెలుసుకున్నారు.

విజిలెన్స్‌, పోలీసులు అధికారులు కలసి అన్నమయ్య భవన్‌లో సమావేశమయ్యారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాఢవీధుల్లో వాహన సేవల నిర్వహణ, గ్యాలరీలలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, శానిటైషన్‌ వంటి విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్ణయాలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఎస్​ఈసీ రమేశ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details