తితిదేలో 92 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు. రోజుకు రెండు వందల మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్.... చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతను వివరించారు. జిల్లాలో 204 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2800కి చేరుకుందని వివరించారు.
తితిదే ఉద్యోగుల్లో 92 మందికి కరోనా - తితిదేలో కరోనా కేసులు
తితిదే ఉద్యోగుల్లో 92 మందికి కరోనా సోకిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. సీఎస్ నీలం సాహ్నీ, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డిల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన...జిల్లాలో కరోనా తీవ్రతపై వివరించారు.
తితిదే ఉద్యోగుల్లో 92 మందికి కరోనా