ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే ఈవోను క‌లిసిన అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు - TTD latest news

వివిధ జిల్లాల‌కు చెందిన 9 మంది అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు తితిదే కార్య‌క‌లాపాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ప‌రిశీలించేందుకు తిరుమలకు వచ్చారు. తితిదే కార్యకలాపాలను ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి వారికి వివరించారు.

nine Assistant collectors meets TTD EO in Tirumala
తితిదే ఈవోను క‌లిసిన అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు

By

Published : Oct 16, 2020, 5:33 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన 9 మంది అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు తితిదే కార్య‌క‌లాపాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ప‌రిశీలించేందుకు తిరుమల చేరుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్లకు తితిదే కార్యకలాపాలను ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి వివరించారు. అధిక మాసం కావటంతో ఈ ఏడాది రెండు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఈ రోజు నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలిపారు.

ఉత్సవాలలో అత్యంత ప్రధాన మైనది గరుడ సేవని... అది అక్టోబ‌రు 20న జ‌రుగుతుంద‌ని ఈవో వివరించారు. తితిదే అమలు చేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్యశాల‌లు, విద్యాసంస్థ‌లు, ఎస్వీబీసీ గురించి వివరించారు. తితిదే చేపట్టిన, జ‌రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తితిదేలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. తితిదే నిర్వ‌హిస్తున్న వివిధ ట్ర‌స్టులు, వేద విద్య‌వ్యాప్తికి తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు. ఈవోతో సమావేశం అనంతరం అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు తితిదే అద‌న‌పు ఈఓ ఎవి.ధ‌ర్మారెడ్డిని క‌లిశారు.

ABOUT THE AUTHOR

...view details