NAYANATHARA : తిరుమల శ్రీవారిని నూతన వధూవరులు నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి కల్యాణోత్సవం సేవలో వారు పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వచ్చిన కొత్త జంటను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాగా ఆలయ మాడ వీధుల్లో ఫోటో షూట్ సమయంలో నయనతార పాదరక్షలు దరించడం వివాదాస్పందంగా మారింది.
స్టార్ హీరోయిన్ నయనతార-క్రేజీ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ వివాహం గురువారం (జూన్ 9) అట్టహాసంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మహాబలిపురంలోని షెరిటన్ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. నయన్-విఘ్నేశ్‌ల వివాహా మహోత్సవానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరో కార్తి, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్, మణిరత్నం హాజరై సందడి చేశారు. స్టార్ హీరోలు అజిత్, విజయ్‌తో పాటు టాలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం.