Nayanthara and Vignesh: నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నయనతార పాదరక్షలు ధరించి తిరుమాడ వీధుల్లో నడిచారని విమర్శలు రావడంతో తితిదే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారి బాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాడ వీధుల్లో నయనతార పాదరక్షలు ధరించడం దురదృష్టకరమన్నారు. ఆలయం ముందు ఫొటో షూట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. న్యాయనిపుణుల సలహాతో నయనతారపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫొటో షూట్ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నయనతార పాదరక్షలు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనన్న బాల్‌రెడ్డి... భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.
వివాదంలో నయనతార దంపతులు.. చర్యలు తీసుకుంటామన్న తితిదే అధికారులు - TTD Officers on nayanathara overaction at tirumala
Nayanthara wears Slippers at Tirumala: తిరుమల మాఢవీధుల్లో నయనతార దంపతులు పాదరక్షలు ధరించడం, ఫోటో షూట్ నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన తితిదే విజిలెన్స్ అధికారి బాల్ రెడ్డి.. న్యాయ నిపుణుల సలహాతో నయనతార దంపతులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు..
Nayanthara wears Slippers at Tirumala