వాతావరణ శాఖ హెచ్చరికలపై ప్రజల్ని అప్రమత్తం చేయటంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. ప్రభుత్వం ఉదాసీనత వల్లే తిరుపతి జలదిగ్బంధంలో(Tirupati rains) చిక్కుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి..సహాయబృందాలను పంపి ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. వరదల్లో చిక్కుకున్న భక్తులకు సాయం అందించాలన్నారు. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన ప్రయాణికలను గమ్యస్థానాలకు చేర్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
nara lokesh: వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం: లోకేశ్ - తిరుపతిలో వర్షాల వార్తలు
వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నారాలోకేశ్(nara lokesh) మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే తిరుపతి జలదిగ్బంధంలో చిక్కుకుందన్నారు. తిరుపతికి సహాయబృందాలను పంపి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
nara lokesh