ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ బాబాయ్ హత్యపై మేం ప్రమాణం చేస్తాం.. మీరు చేస్తారా?: లోకేశ్ - వివేకా హత్యపై నారా లోకేశ్ కామెంట్స్

"మీ బాబాయి హత్యతో మాకు సంబంధం లేదు" అంటూ.. వివేకా హత్య కేసు విషయంలో.. ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు.

మీ బాబాయ్ హత్యతో మాకు సంబంధం లేదు: లోకేశ్
మీ బాబాయ్ హత్యతో మాకు సంబంధం లేదు: లోకేశ్

By

Published : Apr 7, 2021, 10:40 PM IST

మీ బాబాయ్ హత్యతో మాకు సంబంధం లేదు: లోకేశ్

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... సూళ్లూరుపేట, నాయుడుపేటలో ప్రసంగించారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని ప్రచారంలో కోరారు.

"మీ బాబాయి హత్యతో మాకు సంబంధం లేదని తిరుపతి వెంకన్నపై ప్రమాణం చేస్తా.. మీరూ చేస్తారా? జగన్ రెడ్డి" అని బహిరంగ వేదికపై సవాల్ విసిరారు. తోలు బొమ్మలాంటి వారిని వైకాపా నుంచి పార్లమెంట్​కు పంపితే రాష్ట్రానికి ఉపయోగం లేదని లోకేశ్ అన్నారు. వైకాపా ఎంపీలు రాష్ట్రానికి ఏం ఉద్దరించారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details