MLA ROJA MET MUNICIPAL MINISTER BOTCHA SATYANARAYANA: మున్సిపల్ శాఖ మంత్రి సత్యనారాయణను నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలో కలిశారు. తన నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లోని సమస్యలను ఆమె మంత్రికి వివరించారు. నగరిలో నిర్మాణం జరుగుతున్న జగనన్న అర్బన్ హౌసింగ్ కాలనీ పనుల పురోగతి వివరాలనూ వెల్లడించారు.
ప్రధానంగా.. పుత్తూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితిని వివరించిన రోజా.. దాని పునఃనిర్మాణానికి నిధులు అందించాలని కోరారు. అందుకోసం రూ.9 కోట్ల అంచనా వ్యయంతో తయారు చేసిన ప్రతిపాదనను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు సమర్పించారు. అదే విధంగా.. నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని మున్సిపల్ మంత్రిని కోరారు. ఎమ్మెల్యే వివరించిన సమస్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.