తమ సమస్యలు పరిష్కరించాలంటూ... చిత్తూరు జిల్లా పుత్తూరు పురపాలక సంఘం కార్మికులు ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని అందులో ప్రస్తవించారు. ఆప్కాస్ ఏజెన్సీని రద్దు చేయాలని, కార్మికులందరికి ఆరోగ్య కార్డులు అమలు చేయాలని కోరారు.
ఏలూరులో..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట పురపాలక సంఘం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాఠశాల స్వీపర్లు, ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు మూడునెలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. పబ్లిక్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.