Mukesh Ambani: తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన స్వామివారి నిజపాద సేవలో పాల్గొన్నారు. తితిదే ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తితిదే ఈవో ధర్మారెడ్డి ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం అంబానీ స్థానిక ఏనుగు, గోశాల వద్దకు వెళ్లి పరిశీలించి గజరాజల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. తిరుమల శ్రీవారికి రూ.1.5 కోట్లు విరాళం ప్రకటించిన ముఖేశ్ అంబానీ... డీడీని ఆలయంలో తితిదే ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల ఆలయం అభివృద్ధి చెందుతుందని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలిపారు. ముఖేష్ అంబానీ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు.
Mukesh Ambani తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ - తిరుమలలో పీవీ సింధూ
Mukesh Ambani తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, క్రీడాకారిణి ముఖేష్ అంబానీలు శ్రీవారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీవారికి ముఖేశ్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ముఖేష్ అంబానీ, పీవీ సింధూ
PV Sindhu: తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె.... స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాదిలో జరిగే టోర్నమెంట్స్‌లో బాగా ఆడాలని కోరుకున్నానని తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 16, 2022, 3:03 PM IST