ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని వీఆర్‌కు పంపిస్తూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఎస్ఐ బెల్టుతో కొట్టారన్న ఘటన కలకలం రేపగా.. ఇప్పటికే ఈ అంశంపై అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎస్ఐని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్ధాయి విచారణ అనంతరం తప్పు ఉందని తేలితే శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
మహిళను కొట్టారని ఎమ్మార్‌పల్లి ఎస్సైపై ఆరోపణలు..వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు - ఎమ్మార్‌పల్లి ఎస్సైని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు న్యూస్
తిరుపతి ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఘటనలో ఎస్ఐని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను బెల్టుతో కొట్టారని ఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఎమ్మార్‌పల్లి పీఎస్ ఎస్సైని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు