'సీఎం జగన్కు బుద్ధిచెప్పే అవకాశం ఓటర్లకు వచ్చింది'
తిరుపతి ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్కు బుద్ధిచెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని... తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యానవనంలో యువనాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. యువత, నగరవాసులు పలు సమస్యలను చెప్పారని... తిరుపతి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైకాపా ఎంపీలు విఫలమయ్యారని పేర్కొన్నారు. తిరుపతిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తుచేశారు. పనబాక లక్ష్మిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు