'హతమారుస్తానని అధికార పార్టీ నేత బెదిరింపులు' - తిరుపతి ప్రెస్‌క్లబ్ తాజా న్యూస్
తాను అధికార పార్టీకి సంబంధించిన నేతనని... నా మాట వినకపోతే హతమారుస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తిరుపతికి చెందిన ఓ నిర్మాణ సంస్థ గుత్తేదారు ఆరోపించారు. తమ బహుళ అంతస్తు భవనాన్ని రూ.కోటి 89 లక్షలకు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు రూ.70 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
!['హతమారుస్తానని అధికార పార్టీ నేత బెదిరింపులు' అగ్రిమెంట్ వివరాలను వెల్లడిస్తున్న బాధితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6246752-718-6246752-1582983480563.jpg)
అధికార పార్టీకి సంబంధించిన నేతనని... తాను చెప్పినట్లు వినకపోతే హతమారుస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తిరుపతికి చెందిన నాగేంద్రబాబు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలు ఆధారాలతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నాగేంద్రబాబు సమావేశం నిర్వహించారు. తిరుపతి ఎస్వీ నగర్లో బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించినట్లు నాగేంద్రబాబు తెలిపారు. నిర్మాణ సమయంలోనే అనిష్ కుమార్ అనే వ్యక్తి రూ.కోటి 89 లక్షలకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అందుకుగాను అడ్వాన్స్ 70 లక్షలు చెల్లించారని.. అదే మొత్తానికి రిజిస్ట్రేషన్ చేయించాలని అనిష్ కుమార్ ఒత్తిడి చేస్తున్నట్లు నాగేంద్రబాబు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.