తిరుపతి సమీపంలోని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో 27వ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వివిధ రకాల క్రీడా పోటీలు జరిగాయి. విజేతలకు మోహన్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మోదీని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప పరిపాలనాదక్షుడని అన్నారు. తన 70 ఏళ్ల జీవితంలో ఇటువంటి ప్రధానిని చూడలేదని కొనియాడారు. ప్రధానిని కలవడానికి గల కారణం త్వరలోనే వెల్లడిస్తానని ఆయన వివరించారు.
'మోదీ లాంటి ప్రధానిని నా జీవితంలో చూడలేదు' - మోహన్ బాబు వార్తలు
ప్రధాని మోదీపై మంచు మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్రధానమంత్రిని తన జీవితంలో చూడలేదని కొనియాడారు. మోదీతో భేటీలో ఏం మాట్లాడుకున్నామో త్వరలో వెల్లడిస్తానన్నారు.
mohan babu