దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు కేటాయించే వసతిగృహాల్లో 125 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తిరుమలలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. కాటేజీల్లో వసతులపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహాల్లో ఎదురువుతున్న ఇబ్బందులను భక్తులు అదనపు ఈవో దృష్టికి తెచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించడం ద్వారా పొందే దర్శన సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు సూచించారు. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే 50 రూపాయల గదుల అద్దెను పెంచే అంశం ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు.
'తిరుమలలో రూ.125 కోట్లతో వసతి గృహాల ఆధునికీకరణ' - తిరుమలలో భక్తులకు వసతి గృహాలు
తిరుమలలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే 50 రూపాయల గదుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వసతి గృహాల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించడం ద్వారా పొందే దర్శన సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు సూచించారు.
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి