నవతరం పార్టీకి గాజు గుర్తు కేటాయించటంపై జనసేన... భాజపానే నిలదీయాలని వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉప ఎన్నికలో వైకాపా అత్యధిక మెజారీటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన గాజు గ్లాసు గుర్తును వేరే పార్టీకి కేటాయించటంపై పవన్ పార్టీ.. భాజపానే నిలదీయాలన్నారు. కొవిడ్ సమయంలో అంబానీలు, అదానీల వ్యాపారం కోసం ఆలోచించిన పార్టీతో పవన్ పార్టీ పొత్తు పెట్టుకున్నందున ఇలాంటివి అనుభవించక తప్పదన్నారు.
గాజు గుర్తుపై జనసేన.. భాజపానే నిలదీయాలి: సీ.రామచంద్రయ్య - గాజు గ్లాసు గుర్తు వివాదం
గాజు గుర్తు వివాదంపై జనసేన.. భాజపానే నిలదీయాలని వైకాపా ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు వివాదం