Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు గణబాబు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తెలంగాణలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, సినీ రచయిత కోనా వెంకట్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది వీరికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం... రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.