మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతిలో భేటీ అయ్యారు. నిండ్ర ఎంపీపీ ఎన్నికపై మంత్రితో మాట్లాడారు. ఎంపీటీసీలు పార్టీ విప్ ధిక్కరించారని మంత్రికి వివరించారు. రెండోసారి విప్ జారీ చేసినా ఎంపీటీసీలు పాటించలేదని చెప్పారు. పార్టీ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని రోజా కోరారు.
నిండ్రలో జరిగిన పరిణామాలు బాధాకరం. గెలిచిన తరువాత గ్రూప్ రాజకీయాలు చేయడం సీఎం జగన్‌ను, ఆయన పార్టీని, ఆయన ఇచ్చిన బీ-ఫామ్‌ను ధిక్కరించినట్లు అవుతుంది. ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... దిగమింగుకుని పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని కాదని... కో ఆప్షన్ మెంబర్ కోసం రోడ్డు మీద ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం. ఎమ్మెల్యేను, పార్టీ కోసం కష్టపడిన నాయకులందరినీ దూషిస్తూ... ఇతర పార్టీల సహకారంతో ధర్నాలు చేసిన వారిని వైకాపా నుంచి సస్పెండ్ చేయాలి. -రోజా, నగరి ఎమ్మెల్యే